ఛలో చిత్రం ఇచ్చిన భారీ విజయంతో నాగ శౌర్య తన సొంత నిర్మాణసంస్థలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఆ చిత్రం పేరే నర్తనశాల, దానికి శ్రీనివాస చక్రవర్తి అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇదే సమయంలో ముందుగా ఈ చిత్రానికి మెహ్రీన్ ని కథానాయికగా ఎంపిక చేశారు, అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మెహ్రీన్ స్థానంలో హలో మూవీ ఫేం కళ్యాణి ప్రియదర్శన్ ని తీసుకున్నట్టుగా సమాచారం. మొత్తానికి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడుకి ఇదొక షాక్ అనే చెప్పాలి.
అయితే ఈ మార్పునకి కారణాలు తెలియనప్పటికీ మొత్తానికి ఈ అమ్మడుకి మొదటిసారిగా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇదే సమయంలో కళ్యాణి కి కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే చివరి నిమిషాల్లో సినిమాలలో ఇలాంటి మార్పులు చేర్పులు సహజం, మరి చూద్దాం ఇది ఎంతవరకు సినిమాకి ప్లస్ అవుతుందో అనేది.
గుడ్ లక్ తో నర్తనశాల టీం...