బాబోయ్‌ 'బాహుబలి' భయపెట్టేస్తున్నాడు

మరిన్ని వార్తలు

ఎస్‌. ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమా కీర్తి ప్రతిష్ఠల సంగతి ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు. మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడ్డాడు. అలాగే రాజమౌళితో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్టూ, టెక్నీషియన్‌ కూడా ఎంతో కష్టపడి పని చేశారు. కండలు పెంచడానికి ప్రబాస్‌, రానా ఎంత కష్టపడ్డాడో, గుండుతో కనిపించేందుకు కట్టప్ప సత్యరాజ్‌ కూడా అంతే కష్టపడ్డాడు. అలాగే అనుష్క కత్తి యుద్ధాల కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. మరి ఇందరి కష్ట ఫలితం 'బాహుబలి'. అందుకే అదో సెన్సేషన్‌. 

ఇదంతా తెలిసిన సంగతే. ఇలాంటి మన గొప్ప 'బాహుబలి'కి రీమేక్‌ వస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకీ ఇప్పుడు వార్తల్లో నిలిచిన ఈ కొత్త 'బాహుబలి' రీమేక్‌ వివరాల్లోకి వెళితే, భోజ్‌పురి నటుడు దినేష్‌ లాల్‌ యాదవ్‌ హీరోగా, ఇక్బాల్‌ భక్ష్‌ దర్వకత్వంలో ఈ రీమేక్‌ జరుగుతోందట. గతంలోనే ఈ చిత్రం పోస్టర్స్‌ హల్‌చల్‌ చేశాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అంటూ మరోటి విడుదలైంది. అసలింతకీ ఈ కొత్త 'బాహుబలి' కథేంట్రా బాబూ.. అంటూ మన వాళ్లు బుర్రలు బాదుకుంటున్నారు. 

'బాహుబలి' గెటప్‌లో ఈ జోధ్‌పూర్‌ నటుడు సరికొత్త ఫన్‌ ఏమైనా క్రియేట్‌ చేస్తున్నాడో ఏంటో తెలీదు కానీ, గొప్ప చరిత్రగా తెరకెక్కిన రాజమౌళి 'బాహుబలి'ని అంత సింపుల్‌గా తీసి పారేయడానికి అసలెక్కిడి నుండి వచ్చాడీ కొత్త హీరో అని కామెంట్స్‌ అయితే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. 'బాహుబలి' పరువు తీసేలా ఉన్నాయి ఈ పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్స్‌ అంటూ నెటిజన్లు వాపోతున్నారు. చూడాలి మరి ఆల్రెడీ పలు భాషల్లో విడుదలై చరిత్ర సృష్టించేసిన రాజమౌళి 'బాహుబలి'ని ఈ కొత్త బాహుబలి ఏం చేస్తాడో ఏమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS