వరుణ్ తేజ్-రాశి ఖన్నా కలయికలో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మొదటి షో నుండే పెద్ద హిట్ చేసేశారు.
ఇక వారి ఆదరణ కలెక్షన్స్ రూపంలో తొలిప్రేమ చిత్రం పైన కురుస్తున్నది. మొదటిరోజు ఈ చిత్రానికి సుమారు రూ 10కోట్ల వరకు రాగ రెండవ రోజు కూడా ఈ చిత్రం వసూళ్ళ పరంగా దూకుడు ప్రదర్శించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో ఈ చిత్రం రూ 6కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా వేరే ఏరియాల కలెక్షన్ రిపోర్ట్స్ తెలియాల్సిఉంది. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు రాజమౌళి నుండి కూడా ప్రశంసలు దక్కడంతో తొలిప్రేమ యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
మొత్తానికి తొలిప్రేమ చిత్రం వరుణ్, రాశి, వెంకీ లకి ఒక చక్కటి సినిమాగా మిగిలిపోయింది.