ఛాలెంజింగ్‌ రోల్‌లో శ్రియా శరణ్‌!

మరిన్ని వార్తలు

హీరోలే కాదు, హీరోయిన్లు కూడా ఈ మధ్య ఛాలెంజింగ్‌ రోల్స్‌కి సై అంటున్నారు. ముఖ్యంగా సీనియర్‌ హీరోయిన్లు ఛాలెంజ్‌లకు కాలు దువ్వుతున్నారు. మొన్నీ మధ్యనే కాజల్‌ 'సీత' కోసం విలన్‌గా నటించింది. సమంత చేసిన సాహసాలు చెప్పనే అక్కర్లేదు. నయనతార సాహసాలకు లెక్కే లేదు. ఇప్పుడు ఆ క్రమంలో స్టార్‌ హీరోయిన్‌ శ్రియ కూడా చేరిపోయింది. గ్లామర్‌ తారగా పాపులర్‌ అయిన శ్రియా శరణ్‌ ఓ పక్క ఛాన్స్‌ దొరికితే గ్లామర్‌ వదిలి పెట్టడం లేదు.

 

అలా అని విభిన్న పాత్రల్నీ పక్కన పెట్టడం లేదు. ఆ క్రమంలోనే సినిమాటోగ్రాఫర్‌ జ్ఞాన్‌శేఖర్‌ నిర్మిస్తున్న ఓ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీకి శ్రియా సైన్‌ చేసిందట. సుజన ఈ సినిమాకి దర్వకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ తల్లి పాత్ర పోషిస్తోందట. అది కూడా చెవులు వినబడని తల్లి పాత్రట. ఈ పాత్ర తనకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని శ్రియా చెబుతోంది.

 

ఫస్ట్‌ టైం ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్‌లో శ్రియ నటిస్తోంది. గతంలో నయనతార 'నాందా రౌడీ' (నేనూ రౌడీనే) సినిమాలో చెవులు వినబడని యువతిగా నటించి మంచి మార్కులేయించుకుంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటించాడు. మొన్నీ మధ్యనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ 'రంగస్థలం'లో చిట్టిబాబు ది సౌండ్‌ ఇంజనీర్‌గా నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. మరి ఈ పాత్ర శ్రియకు కూడా కలిసొస్తుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS