గతవారం కిచెన్ ఇష్యూపై బాబా భాస్కర్‌ని నామినేట్ చేసింది అషూరెడ్డి. ఆ విషయంలో బాబా భాస్కర్ చాలా హర్ట్ అయ్యారు. తాజాగా మరోసారి బాబా భాస్కర్ హర్ట్ అయ్యే అంశం చోటు చేసుకుంది హౌస్‌లో. ఈ సారి అది అలీ రూపంలో వచ్చింది. కెప్టెన్‌గా అలీకి నలుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ లిస్టులో రాహుల్, హిమజ, వితికా, బాబా భాస్కర్ పేర్లు ప్రస్థావించాడు ఆలీ. ఒకవేళ అలీని ఈ నలుగురిలో ఎవరైనా ఇంప్రెస్ చేస్తే అలీ నామినేషన్ నుండి తప్పించుకోవచ్చని రూల్ పెట్టారు.
దాంతో తన వంతుగా ఆలీని ఇంప్రెస్ చేయడానికి పాపం బాబా భాస్కర్ చాలానే ట్రిక్స్ ప్లే చేశారు. ఆ క్రమంలో ఆలీ, బాబా భాస్కర్‌కి కొన్ని సూచనలిచ్చారు. ప్రతీ విషయాన్నీ కామెడీ చేయకుండా, కొంచెం సీరియస్‌నెస్ మెయింటైన్ చేయమని చెప్పాడు. అంతేకాదు, ఇతరుల్ని ర్యాగింగ్ చేయొద్దనీ, గేమ్‌ని సీరియస్‌గా ఆడాలనీ సూచించాడు. అలీ సూచనల్ని పాఠించిన బాబా భాస్కర్ నామినేషన్ ప్రక్రియలో సీరియస్‌నెస్ మెయింటైన్ చేశారు. కానీ, చివరిగా అలీ, బాబా భాస్కర్‌నే నామినేట్ చేశాడు. అలీ చెప్పినట్లు విన్న తర్వాత కూడా ఆయన్ని నామినేట్ చేయడంతో, అలీ తనకు నమ్మక ద్రోహం చేశాడని భావించి, శ్రీముఖి చెంత కంట తడి పెట్టుకున్నారు బాబా. దాంతో గేమ్‌ని బాబా భాస్కర్ స్పోర్టివ్‌గా తీసుకోవడం లేదనీ, నామినేట్ చేసిన వారిని హేట్ చేస్తున్నాడనీ అనుకుంటున్నారు.
మొన్న పునర్నవి, నిన్న ఆషూ రెడ్డి, ఇప్పుడు అలీ.. ఇలా తనను నామినేట్ చేసిన వారందరినీ బాబా భాస్కర్ హేట్ చేసుకుంటూ పోతారా.? అనే అభిప్రాయానికి వచ్చేశారు బిగ్‌బాస్ వీక్షకులు. ఇదిలా ఉంటే, బాబా భాస్కర్‌కి హౌస్‌లో లాంగ్వేజ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యతోనే మిస్ అండర్ స్టాండింగ్ ప్రాబ్లెమ్ వస్తోందనీ అంటున్నారు కొందరు. ఈ ఈ సమస్యలతో బాబా భాస్కర్ ఎన్నాళ్లు హౌస్‌లో కొనసాగుతారో చూడాలి మరి.