న్యూ లుక్‌లో నందమూరి నటసింహం.

By iQlikMovies - August 20, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ న్యూ లుక్‌లో దర్శనమిచ్చారు. లుక్స్‌ పరంగా బాలయ్య తన సినిమాలకు కొంచెం ఎక్కువే జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే, తాజా లుక్‌ మాత్రం బాలయ్య ఇంతకు ముందెన్నడూ కనిపించని నిఖార్సయిన న్యూ లుక్‌. ఫ్రెంచ్‌ కట్‌ గెడ్డంతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వయసు చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది ఈ లుక్‌లో బాలయ్యకు. బాలయ్యకు 105వ చిత్రమిది.

 

'జై సింహా' సినిమా తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌, బాలయ్య కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. విదేశాల్లో ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. ఆ షూటింగ్‌ స్పాట్‌ నుండి లీకైన బాలయ్య ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిజంగానే బాలయ్య ఈ లుక్‌లో కొత్తగా, చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు. వేదిక, సోనాల్‌ చౌహాన్‌లు ఈ సినిమాలో బాలయ్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమయ్యారు.

 

తొలి షెడ్యూల్‌లో భాగంగా, హీరోయిన్స్‌పై రొమాంటిక్‌ సాంగ్స్‌ చిత్రీకరణ జరిపారనీ సమాచారమ్‌. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌తో కలిసి బాలయ్య ఈ సినిమాని తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS