కొత్త హెయిర్ స్టైల్ లో బాబు గోగినేని

By iQlikMovies - July 14, 2018 - 18:09 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 అప్పుడే అయిదవ వారంలోకి ప్రవేశించడానికి వచ్చేసింది. ఈ సమయంలో ఈ షో పైన రోజురోజుకి వీక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే వస్తుంది.

ఇక ఇంటి సభ్యులందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన వ్యక్తి బాబు గోగినేని. స్వతాహాగా మనవతావాది అయిన ఈయన ఇంటిలో కూడా ఆయన నమ్మిన విలువలకే కట్టుబడి ఉంటుండడం గమనార్హం. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో కూడా ఆయనకి నచ్చితేనే పాల్గొంటాను అని బాహాటంగా చెప్పేయడం ఆయనకే చెల్లింది.

అట్లాంటి మొహమాటం లేని బాబు గోగినేని శైలికి భిన్నంగా ఈ వారంతం మనకి కనిపించనున్నారు అని సమాచారం. ఇంటి సభ్యులు ఆయనకి కొత్త హెయిర్ స్టైల్ ఇచ్చారట. ఆ కొత్త హెయిర్ స్టైల్ తోనే ఆయన ఈ వారంతం హోస్ట్ నాని ముందు కనిపించనున్నాడట.

ఏదేమైనా బిగ్ బాస్ ప్రభావం బాబు గోగినేని పైన కూడా పడిందనే చెప్పక తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS