వర్మ నిర్మాణం - అజయ్‌ భూపతి దర్శకత్వం

మరిన్ని వార్తలు

వర్మ నిర్మాణ సంస్థ కంపెనీలో త్వరలో ఓ సినిమా రూపొందనుందట. ఆ సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్‌ ఎవరో తెలుసా.? అజయ్‌ భూపతి. 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో ప్రస్తుతం ఈ దర్శకుడి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. 

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు అజయ్‌ భూపతి. ఆ టైంలోనే అంటే 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాకి ముందే వీరిద్దరి మధ్యా సినిమా డీల్‌ సెట్‌ అయ్యిందట. అయితే అది ఇప్పటి వరకూ కుదరలేదు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్‌ఎక్స్‌ 100' పోజిటివ్‌ టాక్‌ సంపాదించుకోవడంతో, అజయ్‌ భూపతిపై వర్మకు మరింత గురి కుదరిందట. దాంతో అతి త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో ఉన్నారట. ఓ యంగ్‌ హీరో ఈ సినిమాలో నటిస్తాడనీ సమాచారమ్‌. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

 

ఇకపోతే కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా తెరకెక్కిన 'ఆర్‌ ఎక్స్‌ 100' చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లు కొల్లగొడుతోంది. యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే ఘాటైన రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసే సెంటిమెంట్‌ యాంగిల్‌ కూడా ఈ సినిమాని సక్సెస్‌ దిశగా పరుగులు పెట్టిస్తోంది. అలాగే కాన్సెప్ట్‌ కూడా సరికొత్తగా ఉండడంతో, కొత్తదనం కోరుకునే వారి ఆదరణ కూడా పొందుతోంది 'ఆర్‌ఎక్స్‌ 100'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS