నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ హౌస్ సభ్యునికి ఓ తంటా వచ్చి పడింది. హౌస్‌లోకి ఎంటర్ కాకముందు, ప్రస్తుతం ఆ హౌస్ సభ్యుడైన బాబు గోగినేని పలు ఛానెల్స్ డిస్కషన్స్‌లో పాల్గొనే వారన్న సంగతి తెలిసిందే. ఆ డిస్కషన్స్‌లో భాగంగా ఓ విషయమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేశారనీ, దేశద్రోహం కింద ఆయనపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఆ విషయమై ఆయనకు నోటీసులు కూడా అందాయి.
అయితే తాజాగా ఆయనకు న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. అయితే అవి ఆయన అందుకునే పరిస్థితిలో ప్రస్తుతం లేరు. అయితే ఇష్యూ సీరియస్ కావడంతో ఇప్పుడు బాబు గోగినేనిని పోలీసులు విచారించాల్సి ఉంది. మరి ఈ విచారణ నిమిత్తం ఆయన్ని హౌస్ నుండి ఎలా బయటికి తీసుకొస్తారు.? అనేది ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం ఆయనపై ఎలిమినేషన్ నామినేషన్స్ ఏమీ లేవు. మరి ఆయన్ని ప్రత్యేకంగా ఎలిమినేట్ చేస్తారా? లేక ఒకరోజు విచారణ నిమిత్తం బయటికి తీసుకొచ్చే వెసులుబాటు బిగ్‌బాస్ నిర్వాహకులు ఏమైనా కల్పిస్తారా అనేది అందరికీ ఆశక్తిని కలిగిస్తోంది. గతంలో బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌లో ముమైత్ ఖాన్‌ని ఇలాగే డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ఒకరోజు బయటికి తీసుకొచ్చి మళ్లీ లోపలికి పంపించారు. అలాగే ఇప్పుడు బాబు గోగినేని విషయంలోనూ జరగనుందా? చూడాలి మరి.