'చక్కనమ్మ' అనలేం కానీ, వర్మ కంపెనీ నుండి దిగుమతి అవుతోన్న మరో శృంగార భామ. పేరు ఇరా. వర్మ తన సొంత బ్యానర్ కంపెనీలో మరో నిర్మాతతో కలిసి ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతోనే ఈ అందాల భామ తెలుగు తెరకు పరిచయమవుతోంది. సినిమా పేరు 'భైరవగీత'.
తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి వర్మ దర్శకత్వం వహించడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే. అయినా సినిమాలో కంటెన్ట్ మాత్రం వర్మ మార్క్ కంటెన్టేనని తెలుస్తోంది. అదే బోల్డ్‌నెస్, అదే హింసాత్మకం, అదే అరాచకం. అంతా వర్మ స్టైల్‌లోనే ఈ సినిమా ఉండబోతోందట. ఒక గ్రామంలో భూస్వాములకు, పేదవాళ్లకు మధ్య జరిగే వర్గ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ మిళితమై ఉంటుందట.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం జరిపిన ఆడిషన్స్‌లో వర్మ కంట్లో పడిన ఆ ముద్దుగుమ్మే ఇరా. సినిమాలో బోల్డ్‌గా నటించేసిందట. ఆ బోల్డ్‌నెస్ వర్మని ఎంతో ఇంప్రెస్ చేసేసిందట. ఎప్పుడూ చెప్పే మాటే కదా. ఈ సినిమాతో సిద్ధార్ద్ అనే యంగ్‌స్టర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా గురించి, సినిమాలో హీరోయిన్ ఇరా బోల్డ్‌నెస్ గురించి మన వర్మగారు అప్పుడే పబ్లిసిటీ స్టార్ట్ చేసేశారు.
చూడాలి మరి, వర్మ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా కాంట్రవర్సీతో కూడిన పబ్లిసిటీని ఖాతాలో వేసుకుంటుందో లేక, గ్లామర్ ఎలిమెంట్ ప్లస్ కంటెన్ట్‌తో 'ఆర్ ఎక్స్ 100' సినిమా మాదిరి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటుందో.!