మెగా హీరోల ల‌క్కీ ఛార్మ్‌గా మారిపోయిందా?

By Gowthami - April 23, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

మెగా హీరోల‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌. త‌మ కాంపౌండ్‌లో అడుగు పెట్టి స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుల్ని, హీరోయిన్ల‌నీ అస్స‌లు వ‌ద‌ల‌రు. ఓ హీరోతో హిట్ కొట్టారంటే, మ‌రో హీరో సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టే. అలా... అన‌సూయ‌కూ వ‌రుస‌గా మెగా కాంపౌండ్‌లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

 

'రంగ‌స్థ‌లం'లో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా విజ‌యంలో రంగ‌మ్మ‌త్త‌కూ వాటా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమాలోనూ అన‌సూయ న‌టిస్తోంద‌ట‌. ఇదంతా ఒక యెత్త‌యితే చిరంజీవి సినిమాలోనూ అన‌సూయ‌కు ఛాన్స్ ద‌క్క‌డం మ‌రో ఎత్తు. 

 

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. `సైరా` త‌ర‌వాత చిరు చేయ‌బోయే సినిమా ఇది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం అన‌సూయ‌ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. ఇదే నిజ‌మైతే... మెగా కాంపౌండ్‌కి ఈ హాట్ యాంక‌ర్ ల‌క్కీ ఛార్మ్‌గా మారిపోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS