హీరోల్ని భయపెట్టేస్తున్న సుకుమార్‌.?

By Inkmantra - April 17, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

సుకుమార్‌తో సినిమా అనౌన్స్‌ చేసి, మహేష్‌బాబు మాట మార్చేసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లితో 'మహర్షి' సినిమా తర్వాత మహేష్‌బాబు సుకుమార్‌తోనే సినిమా చేయాల్సి ఉంది. అయితే సుకుమార్‌తో సినిమాకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందనే కారణంతో సుకుమార్‌ని పక్కన పెట్టేసి, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిని లైన్‌లోకి తీసుకొచ్చాడు. సుకుమార్‌ సినిమాని హోల్డ్‌లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు మరోసారి సుకుమార్‌ విషయంలో అదే జరిగింది. ఈ మధ్య సుకుమార్‌ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. 

 

అయితే బన్నీ బర్త్‌డే రోజు అనూహ్యంగా మరో యంగ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ సినిమాని టైటిల్‌తో సహా ప్రకటించేశాడు బన్నీ. 'ఐకాన్‌ - కనబడుటలేదు' అనే సినిమా అది. దిల్‌రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులతో సహా అంతా సిద్ధంగా ఉన్నాయి. దాంతో సుకుమార్‌ సినిమాని పక్కన పెట్టేశాడు బన్నీ కూడా. దాంతో చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులుండి కూడా, సుకుమార్‌ చేతికి పని లేకుండా పోయిందిప్పుడు. 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టినా సుకుమార్‌కి ఎందుకిలా జరుగుతోంది.. అంటే ఆయన ఎంచుకున్న హీరోల పరిస్థితి అలా ఉంది మరి. 

 

వీలైనంత ఫాస్ట్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నారు ఆయా హీరోలు. కానీ సుకుమార్‌ టేకింగ్‌ చాలా లేట్‌గా ఉండడంతో ఆయనతో సినిమా అంటే భయపడిపోతున్నారు. ఆ కారణంగానే సుకుమార్‌ని పక్కన పెట్టేస్తున్నారు. అయినా సుకుమార్‌ ఖాళీగా ఉంటాడా.? ఈ గ్యాప్‌ని చిన్న సినిమాల కోసం యూజ్‌ చేసేసుకోరూ. ఆల్రెడీ మైత్రీ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చేయాల్సిన సినిమాలకు అదిరిపోయే స్క్రిప్టులు సిద్ధం చేసేందుకూ ఈ గ్యాప్‌ని సద్వినియోగం చేసుకుంటారు సుకుమార్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS