అభిమానులు 'చందమామ' అని ముద్దుగా పిలుచుకునే కాజల్ అగర్వాల్ తన ఇన్నేళ్ల కెరీర్‌లో గాసిప్స్‌కీ, రూమర్స్‌కీ చాలా దూరంగా ఉంటుంది. అలాగే కాంట్రవర్సీల జోలికి కూడా పోదు. సహజంగా హీరోయిన్స్‌పై వచ్చే ఉత్తుత్తి అఫైర్స్ కూడా కాజల్ ఖాతాలో లేవనే చెప్పాలి. అయితే తాజాగా కాజల్ సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్న ఓ పోస్ట్ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
కాజల్ లవ్‌లో పడిందా.? ఏంటీ.? అనుకుని ఆశ్చర్యపోతున్నారంతా. 'క్విక్ రిమైండర్.. ఐ లవ్ యూ..' అనే ఈ మెసేజ్ ఏంటో కాజల్ ఎందుకు పెట్టిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు నెటిజన్లు. కానీ కాజల్ నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రస్తుం కాజల్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ క్వీన్ తమిళ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్' మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక తెలుగులో కాజల్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తేజ దర్శకత్వంలో 'సీత' సినిమాలో కాజల్ నటిస్తోంది. అంతేకాదు, బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరో బెల్లంకొండతో రెండు సినిమాల్లో నటిస్తోంది కాజల్ అగర్వాల్. మరోవైపు విశ్వనటుడు కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2' సినిమాలోనూ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవన్నీ కాక త్వరలోనే కాజల్ నిర్మాతగా కూడా మారనుందట. ఈ సినిమాకి 'అ' దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడనీ సమాచారమ్.