బాలయ్య సినిమాలో మనారా ఐటెం సాంగ్‌

మరిన్ని వార్తలు

బాలకృష్ణ - పూరీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషనే అయినా కానీ భారీ అంచనాలున్నాయి ఈ సినిమా మీద. ఎందుకంటే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రంతో ఘన విజయం అందుకున్న స్టార్‌ హీరో బాలయ్య. అలాంటిది బాలకృష్ణతో పూరీ జగన్నాధ్‌ వంటి డైరెక్టర్‌ ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారనేది క్యూరియాసిటీగా ఉంది. ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ ఉందట. మామూలుగానే పూరీ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కి కూడా స్పెషాలిటీ ఉందట. అయితే ఈ సినిమాలో బాలయ్యతో కలిసి ఐటెం సాంగ్‌లో చిందేయడానికి ముద్దుగుమ్మ మనారా చోప్రాను ఎంచుకున్నాడట పూరీ. ఈ ముద్దుగుమ్మ పూరీ డైరెక్షన్‌లోనే 'రోగ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ముద్దుగుమ్మ అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కి కొత్త క్రేజ్‌ వస్తుందనుకున్నాడు కాబోలు పూరీ. ఈ అమ్మడికి బాలయ్యతో చిందేసే ఛాన్స్‌ ఇచ్చాడు. బాలయ్య సినిమా నుండి ఏమేమి ఆశిస్తారో అభిమానలు అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయని పూరీ తెలిపారు. అందులో భాగంగానే ఈ మాస్‌ అట్రాక్షన్‌ ఐటెం సాంగ్‌ అన్నమాట. అన్నట్లు ఈ సినిమాకి 'టపోరీ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS