బాలీవుడ్ స్టార్స్, సౌత్‌లో బాగానే సందడి చేస్తున్నారు ఈ మధ్య. అలాగే సౌత్ నుండి వెళ్లిన వారికి కూడా బాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. తాజాగా సల్మాన్‌ఖాన్ హీరోగా 'టైగర్ జిందా హై' అనే సినిమా రాబోతోంది. ఇది సల్మాన్‌ఖాన్ గతంలో నటించిన 'ఏక్ థా టైగర్' సినిమాకి సీక్వెల్. ఇందులో కన్నడ హీరో సుదీప్ విలన్‌గా నటించనున్నాడట. కన్నడలో స్టార్ హీరోగా సుదీప్‌కి మంచి పేరుంది. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి మరీ విలన్‌గా నటించడానికి సుదీప్ ఏమాత్రం మొహమాటపడ్డంలేదు. 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించాడు సుదీప్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగులో పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతోనే సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. అలాగే 'బాహుబలి' సినిమాలో కూడా చిన్న పాత్రలో సుదీప్ కనిపిస్తాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందడమే తన లక్ష్యమని అంటుంటాడు సుదీప్. ఏదేమైనా బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌కి విలన్‌గా సుదీప్ నటించడమంటే అది బిగ్ న్యూస్ కాకుండా ఉండదు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, రజనీకాంత్ నటిస్తోన్న '2.0' సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసినదే కదా. బాలీవుడ్ స్టార్స్ సౌత్‌పై ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే సౌత్ నుండి వెళ్లిన వారు అక్కడ పాపులర్ అవ్వడం ఆనందించదగ్గ విషయమే.