100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో మంచి విజయం దక్కించుకున్న బాలకృష్ణ తాజా సినిమా కోసం ఏ కాన్సెప్ట్‌ని ఎంచుకోవాలా అనే సస్పెన్స్‌లో ఉన్నాడు. ఆయన నటించిన 'లెజెండ్' సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. అలాంటి సినిమానే ఇంకోటి చేయాలని ప్రస్తుతం బాలకృష్ణ అనుకుంటున్నారట. 'డిక్టేటర్' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారమ్. వీరిద్దరి కాంబినేషన్లో 'డిక్టేటర్' సినిమా వచ్చింది. అయితే అంచనాల్ని అందుకోలేకపోయింది ఆ సినిమా. ఈసారి చేయబోయే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడట శ్రీవాస్. ఈ సినిమాకి దాదాపుగా కథ ఓకే అయ్యిందనీ సమాచారమ్. ఈ సారి రాబోయే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనీ బాలకృష్ణ కూడా శ్రీవాస్‌కి హామీ ఇచ్చారనీ తెలియవస్తోంది. బారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఈ కాంబినేషన్ త్వరలో పట్టాల్కెడానికి సర్వం సిద్ధంగా ఉన్నాయనీ సమాచారమ్. పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉండబోతోందట. ప్రస్తుతం బాలయ్య రాజకీయాల్లో కూడా బాగా యాక్టివ్గానే ఉంటున్నాడు. ఈ తరుణంలో బాలకృష్ణకున్న మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ మంచి పొలిటికల్ సబ్జెక్ట్‌తో శ్రీవాస్ కథని సిద్ధం చేశాడట. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించే అవకాశాలున్నాయని తెలియవస్తోంది.