పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' సినిమాతో నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రీమియర్స్‌తో ఓవర్సీస్లోనూ, ఓపెనింగ్స్‌తో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ తొలి రోజు వసూళ్ళ పండగ తీసుకొచ్చేశాడు 'అజ్ఞాతవాసి'. టాక్ సంగతెలా వున్నా పండగ సీజన్ కావడంతో 'అజ్ఞాతవాసి' వసూళ్ళ ప్రభంజనం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్న వేళ, ఇంకో భారీ సినిమా సంక్రాంతి పండక్కి అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయిపోయింది.
అదే నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'జై సింహా'. పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది. 'నరసింహనాయుడు' సినిమా తరహాలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ అని ఈ సినిమా గురించి చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రోమోస్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలు, ఓపెనింగ్స్ పరంగా బాలయ్య గత చిత్రాల రికార్డుల్ని 'జై సింహా' కొల్లగొట్టేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
ఓవర్సీస్లోనూ 'జై సింహా' గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమయ్యింది. గత ఏడాది సంక్రాంతికి 'గౌతమి పుత్ర శాతకర్ణి'తో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య, ఈసారి 'జై సింహ'గా సంక్రాంతి వసూళ్ళ జాతర సృష్టిస్తారని ట్రేడ్ పండితులూ అంచనా వేస్తున్నారు. బాలయ్య కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా. దాంతో టీడీపీ శ్రేణులూ 'జై సింహా' సినిమా కోసం ఫుల్ ఎనర్జీతో ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్లోనూ బాలయ్య మేనియా ఓ ఊపు ఊపేస్తోంది.