ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది అవ్వకముందే.. బాలయ్య కొత్త కథలు వినడం మొదలెట్టాడు. తాజాగా... సంతోష్ శ్రీన్ వాస్ బాలయ్యకు ఓ కథ వినిపించాడట. ఆ కథ బాగా నచ్చిందని, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. అన్నట్టు.. ఈ సినిమా కోసం టైటిల్ కూడా రిజిస్టర్ చేయించేశార్ట. `బలరామయ్య బరిలోకి దిగితే..` అనే టైటిల్ ని ఈ సినిమా కోసం నమోదు చేశారని సమాచారం అందుతోంది. రభస, కందిరీగ సినిమాలతో ఆకట్టుకున్నాడు సంతోష్ శ్రీన్‌వాస్. ఇప్పుడు `అల్లుడు అదుర్స్` అనిపించే పనిలో ఉన్నాడు. బెల్లకొండ సాయిశ్రీనివాస్ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇది అవ్వగానే.. బాలయ్యతో పనిచేయాలన్నది సంతోష్ శ్రీన్‌వాస్ ప్లాన్. `అల్లుడు అదుర్స్` గనుక అదుర్స్ అనిపిస్తే.. కచ్చితంగా బాలయ్య నుంచి పిలుపు రావొచ్చు.