బాల‌య్య సినిమాపై పుకార్లు న‌మ్మొద్దు

By Gowthami - December 15, 2019 - 12:18 PM IST

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. జ‌న‌వ‌రి నుంచి చిత్రీకర‌ణ మొద‌లెడ‌తారు. ఈ సినిమాలో క‌థానాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకున్నార‌ని, ప్ర‌తి నాయ‌కుడిగా సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ గాలి వార్త‌ల‌నీ, అస్స‌లు న‌మ్మొద్ద‌ని చెప్పుకొచ్చారు బోయ‌పాటి శ్రీ‌ను. రూల‌ర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి బోయ‌పాటి అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. న‌టీన‌టుల్ని ఇంకా ఎంపిక చేయ‌లేద‌ని, త్వ‌ర‌లో ఆ విష‌యాన్ని తానే చెబుతాన‌న్నారు బోయ‌పాటి. సో.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌న్న‌మాట‌.

 

జ‌న‌వ‌రిలో ఈ సినిమా మొద‌లెట్టి కేవ‌లం 100 రోజుల్లో పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. 2020 జూన్, జులైల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది ల‌క్ష్యం. అందుకే బోయ‌పాటి ప్రీ ప్లాన్డ్‌గా వెళ్తున్నారు. ఆయ‌న ఈ సినిమాని అనుకున్నంత వేగంగా తీస్తారా, లేదా? అన్న‌ది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS