అయ్యో.! నాగబాబు ఇలా జరిగిందేంటబ్బా.!

మరిన్ని వార్తలు

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అంటే ఇదేనేమో. మెగాబ్రదర్‌ నాగబాబు విషయంలో అలాగే జరుగుతోంది. ఆయన ఏదో అనుకుంటే అనుకోకుండా ఇంకేదో జరుగుతోంది. ఓ చిన్నపిల్లాడు సారే జహాసే అచ్చా పాటను ఎంతో చక్కగా ఆలపించిన వీడియో ఒకటి నాగబాబుకు దొరికింది. ఆ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసుకున్నాడు నాగబాబు. అది చూసి, బాలయ్య ఫ్యాన్స్‌ చిర్రెత్తిపోతున్నారు. 

 

అదేంటీ, ఎవరో చిన్న పిల్లాడు ఎంత ముద్దుగా ఆ పాటను ఆలపించాడో కదా.. అని నాగబాబు ఆ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసుకోవడమేంటీ.? దానికి బాలయ్య ఫ్యాన్స్‌ ఫైర్‌ అవ్వడమేంటీ.? అనుకుని అవాక్కవుతున్నారా.? అదే మరి. అయితే నాగబాబు దీన్ని ఏ ఉద్దేశ్యంతో పెట్టినా, కనెక్షన్‌ అలా అక్కడికి కుదిరింది మరి. వివరాల్లోకి వెళితే, ఈ మధ్య తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య హైద్రాబాద్‌లో క్యాంపెయినింగ్‌ చేసిన సందర్భంలో ఓ సారి స్పీచ్‌లో భాగంగా సారే జహాసే అచ్చా పాటను ఆలపించే ప్రయత్నం చేశారు. 

 

అయితే సినిమాల్లో డైలాగుల మీద డైలాగులు పేలగొట్టే బాలయ్య బహిరంగ వేదికలపై చేసే స్పీచ్‌లో ఎంతగా తడబడి మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అలాగే ఆ సందర్భంలోనూ సారే జహాసే అచ్చా పాటకు తడబడ్డారు. అక్కడకీ, ఇక్కడికీ కనెక్షన్‌ కలుపుకుని బాలయ్య ఫ్యాన్స్‌, ఇప్పుడు నాగబాబుపై ఫైర్‌ అయిపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై రచ్చ రచ్చ జరిగిపోతోంది. మొన్నా మధ్య బాలయ్య ఎవరో తనకు తెలీదన్నారు నాగబాబు. ఇలా అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి. పనిలో పనిగా అన్నీ గుర్తు చేసుకుని నాగబాబుని ఆడేసుకుంటున్నారు బాలయ్య ఫ్యాన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS