వినయ విధేయుడు మరో మగధీరుడే.!

మరిన్ని వార్తలు

ఈ స్టిల్‌ వచ్చాక సినిమాపై ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ఇంతవరకూ ఎక్కడో చోట ఉన్న చిన్నా చితకా అనుమానాలు పటాపంచలైపోయాయి. ఇదంతా చరణ్‌ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' గురించే. రేపు సాయంత్రం 'వినయ విధేయ రామ' సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ తాజాగా చిత్ర యూనిట్‌ ఓ స్టిల్‌ రిలీజ్‌ చేసింది. 

 

అసలు సిసలు మెగా పవర్‌ స్టిల్‌ ఇది. గుర్రంపై చరణ్‌ రైడ్‌ చేస్తున్నట్లున్న స్టిల్‌ ఇది. అంతే సినిమాకి 'మగధీర' సినిమాకున్నంత వెయిట్‌ వచ్చేసింది ఈ స్టిల్‌ చూడగానే. 'మగధీర' సినిమాలో చరణ్‌ హార్స్‌ రైడింగ్‌కి విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. చిరంజీవి తర్వాత హార్స్‌ రైడింగ్‌కి అంత అందం తీసుకొచ్చిన హీరో చరణ్‌. అయితే ఆ సినిమాలో ఓ యోధుడిగా గుర్రంపై స్వారీ చేశాడు చరణ్‌. ఇప్పుడీ సినిమా కోసం స్టైలిష్‌ లుక్‌లో గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ఏ సందర్భంలో గుర్రం ఎక్కాల్సి వచ్చిందో కానీ, స్టిల్‌ మాత్రం చంపేస్తోందంతే.

 

'రంగస్థలం' సినిమాలో చరణ్‌ పర్‌ఫామెన్స్‌కీ, బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించి, బాక్సాఫీస్‌ వద్ద కొల్లగొట్టిన కలెక్షన్స్‌కీ చరణ్‌ నుండి తదుపరి రాబోయే సినిమాపై అంచనాలుండడం సహజమే. అయితే అంచనాలెలా ఉన్నా, 'వినయ విధేయ రామ' సినిమాపై అక్కడక్కడా కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఈ స్టిల్‌తో ఫ్యాన్స్‌కి పూర్తి నమ్మకం వచ్చేసింది. బోయపాటి ఖచ్చితంగా ఏదో మ్యాజిక్‌ చేస్తాడనే అనిపిస్తోంది. సంక్రాంతికి చరణ్‌ మరో బ్లాక్‌ బస్టర్‌ని బాక్సాఫీస్‌కి అందించడం పక్కా అంటున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS