చైతూ లేకుండా బంగార్రాజు ఉంటాడా?

By Gowthami - September 26, 2019 - 12:45 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున చేతిలో ఉన్న మ‌రో ప్రాజెక్టు `బంగార్రాజు`. `సోగ్గాడే చిన్నినాయ‌న‌` హిట్ట‌వ్వ‌డంతో దానికి సీక్వెల్‌గా `బంగార్రాజు` తీద్దామ‌నుకున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప‌ట్టాలెక్కాల్సింది. కానీ... స్క్రిప్టు ప‌క్కాగా రాక‌పోవ‌డంతో ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. నాగ్‌తో పాటుగా నాగ‌చైత‌న్య కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడ‌ని తెలియ‌డంతో - అక్కినేని అభిమానుల‌కు కొత్త జోష్ వ‌చ్చింది. అయితే... ఈ సినిమా ఆల‌స్యం అవ్వ‌డం మాత్రం ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే.

 

ఇటీవ‌లే అనూప్‌రూబెన్స్ ఆధ్వ‌ర్యంలో మ్యూజిక్ సిట్టింగ్ మొద‌ల‌వ్వ‌డంతో - హ‌మ్మ‌య్య అనుకున్నారు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ ప్రాజెక్టు డైలామాలో ప‌డింది. ఈ ప్రాజెక్టు నుంచి నాగ‌చైత‌న్య త‌ప్పుకున్నాడ‌ని టాక్‌. త‌న చేతిలో వ‌రుస‌గా సినిమాలు ఉండ‌డంతో `బంగార్రాజు`కి స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాడ‌ట‌.

 

దాంతో మ‌రో హీరోని వెదుక్కోవాల్సివ‌స్తోంది. చైతూ - నాగ్ ఉంటే ఈ ప్రాజెక్టుకి లుక్ వేరుగా ఉంటుంది. కానీ చై త‌ప్పుకుంటే ఈ సినిమా ఉంటుందా, లేదా? అనేది అనుమానం మొద‌ల‌వుతుంది. మ‌రి చై లేకుండా న‌టించ‌డానికి నాగ్ ముందుకొస్తాడా, లేదా అనేది చూడాలి. లేక‌పోతే ఈ ప్రాజెక్టు ఆగిపోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS