సోగ్గాడే చిన్ని నాయిన కి ప్రీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం `బంగార్రాజు`. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలా అనుకుంటే ఇది అక్కినేని మల్టీస్టారర్. పైగా `సోగ్గాడే చిన్ని నాయిన` నాగ్ కెరిర్ లో అతి పెద్ద సూపర్ హిట్. కమర్షియల్ గా ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. నాగ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా అదే. కాబట్టి... `బంగార్రాజు`పై బోలెడన్ని అంచనాలున్నాయి. ఈ సినిమాకి కావల్సినంత బడ్జెట్ కేటాయించుకోవొచ్చు. కానీ.. ఈ విషయంలో నాగార్జున మహా పిసినారితనం చూపిస్తున్నట్టు ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమాలో రంభ - ఊర్వశి - మేనకలను పోలిన పాత్రలున్నాయి. ఆ పాత్రల్లో పేరున్న, క్రేజీ హీరోయిన్లు ఉంటే బాగుంటుందన్నది దర్శకుడి ఉద్దేశ్యం. కానీ నాగార్జున మాత్రం `హీరోయిన్లకు అంత బడ్జెట్ లేదు` అన్నాడట. దాంతో మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్. వేదిక లను ఎంచుకోవాల్సివచ్చింది. ఈముగ్గురూ దాదాపుగా ఫేడవుట్ అయిపోయినవాళ్లే. ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఫామ్ లో ఉన్నవాళ్లని తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అందుకే... ఫ్లాపు హీరోయిన్లని పట్టుకురావాల్సివచ్చింది. మరి వీళ్లంతా కనీసం ఈ సినిమాలో అయినా తమ ప్రతాపం చూపిస్తారా, లేదా? అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.