మహేష్‌బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. మహర్షి తరవాత మొదలవ్వబోయే మహేష్ సినిమా ఇదే. ఇందులో మహేష్ బాబు పోలీస్‌గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో మహేష్ పోలీస్కాదట. అంతకు మించిన పాత్రలో కనిపించబోతున్నాడట. మహేష్ ఓ మిలటరీ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది.
సెలవల కోసం ఇంటికి వచ్చిన ఆఫీసర్‌కి ... ఇక్కడ ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఓ పాత్ర రష్మికా మండన్నాకు దక్కింది. మరో కథానాయిక ఎంపిక కోసం చిత్రబృందం తీవ్ర కసరత్తులు చేస్తోంది. దిల్‌రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.