స్టువర్టుపురం అంటే దొంగలకు ఫేమస్. అందులో.. టైగర్ నాగేశ్వరరావు.. ఓ గజదొంగ. తన గురించి జనాలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా వస్తోంది. ఇందులో ఎవరు నటిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. రానా, రవితేజల దగ్గరకు ఈ కథ వెళ్లింది. ఈ సినిమాలో రవితేజ ఫిక్సయిపోయాడని వార్తలూ వచ్చాయి. అయితే చివరికి ఆ ఛాన్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి దక్కింది.
ఈ సినిమాలో తనే హీరో. ఈచిత్రానికి `స్టువర్టుపురం దొంగ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బెల్లంకొండ గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తారు. కె.ఎస్. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. 1970 - 1980ల మధ్య జరిగే కథ ఇది. భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం `ఛత్రపతి` హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు బెల్లంకొండ. ఆ సినిమా పూర్తయ్యాకే.. `స్టువర్టుపురం దొంగ` సెట్స్‌పైకి వెళ్తుంది. హీరోయిన్, మిగిలిన వివరాలూ త్వరలో ప్రకటిస్తారు.