యాంగ్రీ యంగ్‌మెన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రాజశేఖర్‌ని దాదాపు అంతా మర్చిపోయిన సమయంలో 'గరుడవేగ' చిత్రం ఆయన్ని హీరోగా మరోసారి రేసులో ముందుకు తీసుకొచ్చింది. ఉనికే లేని రాజశేఖర్‌తో భారీ బడ్జెట్‌తో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గరుడవేగ' చిత్రం మంచి విజయం అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ విజయోత్సాహంతో ఎలాంటి తప్పుటడుగులు వేయకుండా, రాజశేఖర్ ఆచి తూచి అడుగులు వేశారు. కాస్త ఆలోచించి 'ఆ' చిత్రంతో వెలుగులోకి వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమాకి సై అన్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ లుక్ కూడా వచ్చింది. ఆగస్టు 26న ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? అనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే దాదాపు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తున్నాయి. రాజశేఖర్ సరసన తెలుగమ్మాయి అంజలి నటించనుందనీ తాజా సమాచారమ్.
ప్రస్తుతం అంజలికి తెలుగులో అవకాశాల్లేవు. సో ఆల్రెడీ 'గరుడవేగ'తో ఫామ్‌లోకొచ్చిన రాజశేఖర్ పక్కన నటిస్తే, ఒకవేళ ఆ సినిమా ఆశించిన విజయం అందుకుంటే, అంజలికి మళ్లీ తెలుగులో స్థానం పదిలమైనట్లే కూడా. అయితే అఫీషియల్‌గా ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వెంకటేష్‌కి జోడీగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలోనూ, బాలయ్యతో 'లయన్'లోనూ నటించింది అంజలి. ఇప్పుడు రాజశేఖర్‌తో జోడీ కడితే, సీనియర్ హీరోలకు అంజలి ఆప్షన్‌గా మారిపోయినట్లే మరి.