నాగబాబు కోసం 'జబర్దస్త్‌' ప్రచారం.!

మరిన్ని వార్తలు

నవ్వుల నవాబు నాగబాబు కోసం 'జబర్దస్త్‌' బ్యాచ్‌ అంతా ప్రచారానికి దిగింది. జనసేన తరపున నర్సాపురం నుండి ఎంపీగా పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న మెగా బ్రదర్‌ నాగబాబుకి సపోర్ట్‌గా ఆల్రెడీ ఆయన ఫ్యామిలీ నుండి భార్య, కూతురు నిహారిక రంగంలోకి దిగారు. జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు నాగబాబుని అమితంగా అభిమానించే జబర్దస్త్‌ బ్యాచ్‌ ఆది, రామ్‌ ప్రసాద్‌, రాఘవ, చమ్మక్‌ చంద్ర తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. 

 

ఇంటింటికీ తిరిగి మరీ నాగబాబుకు ఓటేయమనీ, జనసేనను గెలిపించమనీ వీరు అభ్యర్ధించడం సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటోంది. తాగుబోతు రమేష్‌ తదితరులు కూడా నాగబాబు తరపున ప్రచారం చేస్తున్నారు. అలాగే 'గబ్బర్‌సింగ్‌'లో కామెడీ రౌడీలుగా ఓ ఎపిసోడ్‌లో కీలక పాత్రలు పోషించిన కమెడియన్స్‌ బ్యాచ్‌ కూడా జనసేన తరపున ప్రచారంలో చాలా కష్టపడుతున్నారు. 

 

అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించినా, ఈ బ్యాచ్‌కి 'గబ్బర్‌సింగ్‌'తోనే అంత పాపులారిటీ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ కారణంగానే అది దక్కిందనే అభిమానంతో ఈ గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ స్వతహాగా జనసేనకు సపోర్ట్‌ చేస్తూ, ప్రచారంలో పాల్గొంటుండడం విశేషం. ఇదిలా ఉంటే 'జబర్దస్త్‌' గ్లామర్‌ క్వీన్స్‌ అనసూయ, రష్మి కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS