అఖిల్‌ ట్రైనింగ్‌ నాగచైతన్య యాక్టింగ్‌.!

మరిన్ని వార్తలు

అక్కినేని అందగాడు అఖిల్‌ సినిమాల్లో సత్తా చాటలేకపోతున్నా, క్రికెట్‌లో మంచి ఘనుడన్న సంగతి తెలిసిందే. ఒకవేళ సినిమాల్లోకి రాకుంటే, అఖిల్‌ మంచి క్రికెటర్‌ అయ్యుండేవాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్స్‌లో అప్పుడప్పుడూ సత్తా చాటుతుంటాడు అఖిల్‌. ఇక ఇప్పుడు అన్న నాగచైతన్య కోసం అఖిల్‌ కోచ్‌గా మారాడట. అన్నయ్య చైతూకి క్రికెట్‌ పాఠాలు చెప్పాడట. 

 

నాగచైతన్య ప్రస్తుతం 'మజిలీ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రేపు అనగా ఏప్రిల్‌ 5న 'మజిలీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య క్రికెటర్‌గా నటించాడు. అయితే నిజానికి నాగచైతన్యకు అసలు బ్యాట్‌ పట్టుకోవడమే రాదంట. ఈ సినిమా స్క్రిప్టు వినగానే మొట్ట మొదటగా అఖిల్‌ దగ్గరికి వెళ్లిపోయాడట. అఖిల్‌ దగ్గర క్రికెట్‌లో చిన్న చిన్న కొన్ని టిప్స్‌ నేర్చుకున్నాక, అఖిల్‌ సూచనతో ఓ ట్రైనర్‌ని పెట్టుకున్నాడట. 

 

అలా సినిమా కోసం అఖిల్‌ సాయంతో క్రికెట్‌ నేర్చుకున్నాననీ చైతూ స్వయంగా చెబుతున్నాడు. చైతూ, సమంత జంటగా నటించిన సినిమా 'మజిలీ'. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. దివ్యాన్ష కౌశిక్‌ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. 'మజిలీ' ప్రమోషన్స్‌లో భాగంగా పై విషయాల్ని ఫ్యాన్స్‌తో సరదగా షేర్‌ చేసుకున్నారు నాగచైతన్య.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS