సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు తమ చిత్రాలు అయిన- భరత్ అనే నేను & నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాల విడుదల తేదీలలో మార్పులు చేసుకున్నారు.
ముందుగా వారు అనుకున్నది ఏంటంటే- ఈ రెండుచిత్రాలు ఏప్రిల్ 27న విడుదల కావాల్సి ఉంది అయితే అనుకోకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రం కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటన రావడంతో ఈ రెండు చిత్రాలని తమ విడుదల తేదీని ఏప్రిల్ 26కి మార్చుకున్నారు.
అయితే ఈ తరుణంలో ఈ రెండు చిత్రాలకు సంబందించిన నిర్మాతలు ఒక చోట సమావేశం అయి ఇలా విడుదల తేదీలు ఒకటే అయితే రెండు చిత్రాలకి బిజినెస్ పరంగా ఇబ్బందులు వస్తాయి అని అభిప్రాయపడ్డారు. అందుకే భరత్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 20న అలాగే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని మే 4న విడుదల చేయాలని వారు తీర్మానించారు.
ఈ నిర్ణయంతో ఈ విడుదల తేదీల సమస్యకి ఒక పరిష్కారం లభించింది.