'భార‌తీయుడు' గంద‌ర‌గోళంలో ప‌డ్డాడు

మరిన్ని వార్తలు

ఇటు శంక‌ర్‌, అటు క‌మ‌ల్‌హాస‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న చిత్రం 'భార‌తీయుడు 2'. ఇద్ద‌రికీ ఇప్పుడో సూప‌ర్ హిట్ కావాలి. అది భార‌తీయుడే ఇవ్వ‌గ‌ల‌డ‌ని వాళ్ల న‌మ్మ‌కం. అయితే ఈ సినిమా ఇప్పుడు గంద‌ర‌గోళంలో పడింది. ఎంత‌గా అంటే అస‌లు ఈ సినిమా ఉంటుందా, లేదా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. దీనంత‌టికీ కార‌ణం.. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ చిత్రాన్ని లైకానే నిర్మిస్తోంది. 

 

ర‌జ‌నీకాంత్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'రోబో 2' లైకాని తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచింది. ఈసినిమాతో దాదాపు వంద కోట్ల న‌ష్టాలొచ్చాయ‌ట‌. ఇప్పుడు `భార‌తీయుడు 2`కి శంక‌ర్ 250 కోట్ల బడ్జెట్ వేశాడ‌ట‌. రూ.250 కోట్లు ఇవ్వ‌డానికి లైకా సైతం సిద్ధంగా ఉంది. కాక‌పోతే... ఈ సినిమాని ఇంత‌లోనే పూర్తి చేస్తాన‌ని ముందుగానే ఓ అగ్రిమెంట్ చేయ‌మంటున్నార్ట‌. ఒక‌వేళ బ‌డ్జెట్ పెరిగితే.. లైకా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అదంతా శంక‌ర్ భ‌రించాల్సివ‌స్తుంది. కానీ శంక‌ర్ మాత్రం అందుకు ఒప్పుకోవ‌డం లేదు. 

 

'రోబో 2' విష‌యంలో చాలా పొర‌పాట్లు జ‌రిగాయి. అనుకున్న బ‌డ్జెట్‌కీ, అయిన బ‌డ్జెట్‌కీ పొంత‌న‌లేదు. శంక‌ర్ త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చు పెట్టించ‌డంతో... బ‌డ్జెట్ త‌డిసిమోపెడ‌య్యింది. అందుకే లైకా ఇలా ముందు జాగ్ర‌త్త తీసుకుంద‌న్న‌మాట‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ని, క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణ బాధ్య‌త‌ల్నీ త‌న నెత్తిమీద వేసుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే క‌మ‌ల్ అందుకేమాత్రం ధైర్యం చేయ‌డం లేద‌ట‌. ఒక‌వేళ క‌మ‌ల్ కూడా `నా వ‌ల్ల కాదు` అంటే.. ఈ ప్రాజెక్టు ఆగిపోయిన‌ట్టే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS