శంకర్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆయన సినిమాలో భారీ హంగులు కనిపిస్తాయి. షూటింగ్‌కి సమయం తీసుకుంటారు. రెండు మూడేళ్ల పాటు సెట్లో లేకపోతే ఆయన సినిమా పూర్తయినట్టే ఉండదు. రోబో 2.ఓ కోసం శంకర్ ఎంత సమయం తీసుకున్నారో రజనీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం శంకర్ స్పీడు పెంచబోతున్నాడు.
`భారతీయుడు 2` ని కాస్త తొందరగానే తీసుకొద్దామని భావిస్తున్నారు. అంతే కాదు.. షూటింగ్ కూడా శరవేగంగా చేయాలని నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా ఓ టీజర్‌ని ముందే విడుదల చేయాలని ఫిక్సయ్యారు. అతి త్వరలో భారతీయుడు 2 టీజర్ రాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు మిగిలిన భారతీయ భాషలన్నింటిలోనూ విడుదల చేస్తారు.
అందుకే ఎలాంటి డైలాగులూ లేని ఓ టీజర్‌ని వదలాలని చిత్రబృందం భావిస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాలతోనూ మమేకం అయ్యున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు కూడా. కమల్ రాజకీయ ప్రస్థానానికి ఆలంబనగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. టీజర్నీ అలానే డిజైన్ చేస్తారేమో చూడాలి.