భార‌తీయుడికి మేక‌ప్ క‌ష్టాలు

మరిన్ని వార్తలు

భార‌తీయుడు.. ఈసినిమాని ఏ భార‌తీయ ప్రేక్ష‌కుడూ మ‌ర్చిపోడు. అందులో మ‌స‌లి క‌మ‌ల్ హాస‌న్ విన్యాసాలు అయితే మ‌రీనూ. అస‌లు ఆ మేక‌ప్ ఎలా సాధ్య‌మైంది?  క‌మ‌ల్‌ని ముస‌లోడిగా ఎలా మార్చ‌గ‌లిగారు? అనేది అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అప్పుడు శంక‌ర్ ఏ మ్యాజిక్ చేశాడో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం `భార‌తీయుడు 2` మేక‌ప్ విష‌యంలో అష్ట‌క‌ష్టాలూ ప‌డుతున్నాడు.

 

శంక‌ర్ - క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో `భార‌తీయుడు 2` తెర‌కెక్కుతోంది. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స‌జావుగా సాగ‌డం లేదట‌. 10 రోజులు తీయాల్సిన సీను 20 రోజులు ప‌డుతుంద‌ట‌. కోటి రూపాయ‌లు బ‌డ్జెట్ వేస్తే నాలుగు కోట్లు ఖ‌ర్చువుతోంద‌ట‌. ఇదంతా క‌మ‌ల్ మేక‌ప్ వ‌ల్లే అని తేలింది. క‌మ‌ల్ మేక‌ప్ కోసం రోజుకి నాలుగు గంట‌లు వృధా అవుతోంద‌ని స‌మాచారం. 

 

దాని వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం అవుతోంద‌ట‌. మేక‌ప్ ఏమైనా తేడా వ‌స్తే... తీసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ తీసుకుంటూ వెళ్తున్నాడ‌ట‌. మేక‌ప్ కోసం ఈ వ‌య‌సులో అన్నేసి గంట‌లు కూర్చోవ‌డం క‌మ‌ల్‌కి సైతం ఇబ్బందిగా మారింద‌ని, బ‌డ్జెట్ భారాన్ని మోయ‌లేక నిర్మాత‌లు క‌ల్లు తేలేస్తున్నార‌ని స‌మాచారం. దాంతో ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలా, లేదంటే మ‌ధ్య‌లోనే ఆపేయాలా? అనే సందిగ్థంలో భార‌తీయుడు టీమ్ ప‌డింద‌ట‌. మ‌రి ఈ క‌ష్టాలు గ‌ట్టెక్కేదెప్పుడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS