చిక్కుల్లో ప‌డిన‌ నాని.... 'గ్యాంగ్ లీడ‌ర్‌'

By Gowthami - March 09, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

నాని - విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో 'గ్యాంగ్ లీడ‌ర్' అనే సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టైటిల్ చిక్కుల్లో ప‌డింది. 'ఈ టైటిల్ మాది.. మీకెందుకు ఇస్తాం?' అంటూ  శింగ‌లూరు మోహ‌న‌రావు అనే నిర్మాత ప్ర‌శ్నిస్తున్నాడు. గ‌త అక్టోబ‌రులో 'గ్యాంగ్ లీడ‌ర్‌' అనే పేరుతో ఆయ‌న ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఓ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. 'మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది ర‌చ్చ‌' అనే శీర్షిక కూడా పెట్టారు. ఇప్పుడు నాని సినిమాకి అదే టైటిల్ పెట్టారు.

 

'అక్టోబ‌రులో నేను రిజిస్ట‌ర్ చేయించుకున్న టైటిల్ ఇది. దాన్ని నాని సినిమాకి ఎలా పెడ‌తారు? రూ.3 కోట్ల రూపాయ‌ల‌తో ఈసినిమా తీద్దామ‌నుకున్నా. టైటిల్ ప్ర‌క‌టించ‌గానే రూ.50 ల‌క్ష‌ల ఫండింగ్ కూడా వ‌చ్చింది. చిరంజీవి ఇమేజ్‌కి, ఆ పేరుకి ఏమాత్రం మ‌చ్చ రాకుండా ఈ సినిమా త‌యారు చేస్తున్నాం. టైటిల్ ఇవ్వ‌మ‌ని మైత్రీ మూవీస్ వాళ్లు అడుగుతున్నారు. డ‌బ్బులూ ఆఫ‌ర్ చేస్తున్నారు. కానీ మేం టైటిల్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు' అని అంటున్నాడు ఆ నిర్మాత‌. 

 

'మెగా హీరోలు ఈ టైటిల్ తీసుకుంటే ఇస్తాం. వేరే హీరోల‌కు ఇవ్వం. డ‌బ్బులు ఇస్తామ‌న్నా లొంగం' అంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఛాంబ‌ర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ నిర్మాత టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకుంటే, యేడాది పాటు ఆ టైటిల్ మ‌రొక‌రికి ఇవ్వ‌డం కుద‌ర‌దు. అలాంట‌ప్పుడు నాని సినిమాకి ఈ టైటిల్ ఎలా వ‌చ్చిందో?  మొత్తానికి మైత్రీ మూవీస్‌కి ఈ టైటిల్‌తో పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డిన‌ట్టుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS