గత వారం విడుదలైన `భీష్మ` టాలీవుడ్‌కి విజయాల కొరత తీర్చింది. తొలి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లిపోయింది. తొలి వారాంతంలో మంచి జోష్ చూపించింది. సోమవారం నుంచి కూడా నిలకడగా వసూళ్లు రావడంతో పంపిణీదారులు లాభాల బాట పట్టారు. తొలి వారంలో ఈ సినిమాకి దాదాపుగా 24 కోట్ల షేర్ లభించింది. చాలా ఏరియాల్లో ఈపాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇకమీదట వచ్చిన ప్రతీ రూపాయీ లాభమే.
ఈ వారం హిట్ సినిమా విడుదలైంది. అది కేవలం మల్టీప్లెక్స్‌కే పరిమితమైతే, బీసీలలో భీష్మ మరింత రెచ్చిపోవొచ్చు. నైజాంలో భీష్మకు 7.5 కోట్లు వచ్చాయి. సీడెడ్‌లో 2.8 కోట్లు తెచ్చుకుంది. ఉత్తరాంధ్రలో రెండున్నర కోట్లు, గుంటూరులో కోటిన్నర వసూలు చేసింది. ఓవర్సీస్ లో 3 కోట్లు వచ్చాయి. అక్కడ దాదాపుగా అరకోటి లాభాల్లో ఉన్నాడు పంపిణీదారుడు. ఈ వీకెండ్ కూడా భీష్మ తన జోరు చూపించగలిగితే 30 కోట్ల మైలురాయికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.