ఒకటి కాదు, రెండు కాదు.. చెప్పుకోదగ్గ సినిమాలు ఏకంగా ఐదు ఈ రోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. తెలుగులో 'అంతరిక్షం', 'పడి పడి లేచే మనసు' సినిమాలో విడుదలవుతుండగా, మిగతావి డబ్బింగ్ సినిమాలు, ఓ హిందీ సినిమా. కన్నడ, తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నా, వాటిపైనా అంచనాలు బాగానే వున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ సినిమా కావడంతో 'జీరో'పైనా అంచనాలు ఓ రేంజ్‌లో వున్నాయి. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ ట్రెండ్ నడుస్తుండడంతో..
మల్టీప్లెక్స్‌లలో ఆయా సినిమాలకు గట్టి పోటీ కన్పిస్తోంది. 'అంతరిక్షం' సినిమాకి క్లాస్ ఆడియన్స్ ఎక్కువ ఎట్రాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. 'పడి పడి లేచే మనసు' సినిమాదీ ఇదే పరిస్థితి. 'కెజిఎఫ్', 'మారి-2' మాత్రం మాస్‌ని టచ్ చేస్తాయి. 'జీరో' అందర్నీ తనవైపుకు తిప్పుకునే అవకాశాలున్నాయి. ఓవర్సీస్ టాక్.. అంటూ ఈ ఐదు సినిమాలకీ బీభత్సమైన పాజిటివ్ టాక్‌ని కొందరు స్ప్రెడ్ చేస్తోంటే, నెగెటివ్ టాక్ కూడా ఆ స్థాయిలోనే ప్రచారంలోకి వచ్చింది.
రానున్నది ఫెస్టివల్ వీక్ కావడం, ఈ వీకెండ్‌తో సంబరాలు, సెలవులు మొదలువుతుండడంతో.. సినీ అభిమానులు, ఎన్ని సినిమాలొచ్చినా ఆదరించేందుకు సిద్ధంగా వున్నారు. ఈ క్రిస్‌మస్‌కి ఐదు ముఖ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందర సందడి చేయనున్న దరిమిలా, ఓ మోస్తరు టాక్ రాబట్టుకుంటే చాలు, బాక్సాఫీస్ వద్ద ఆయా సినిమాలకు కాసుల వర్షం కురిసినట్లే. ఆల్ ది బెస్ట్ టఱు ఆల్ మూవీస్.