ఫస్ట్ ఫస్టే శ్రీముఖికీ, హిమజకూ మధ్య నామినేషన్ వార్‌తో స్టార్ట్ అయిన బిగ్‌బాస్ హాట్ మజా రోజుకో ట్విస్ట్ ఇస్తూ వస్తోంది. హౌస్‌లో కాసేపు కామ్‌గా ఉన్నట్లు కనిపించినా, ఏదో మూల నుండి ఏదో ఒక రకంగా కాంబినేషనల్ ఫైట్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా శ్రీముఖీ, హేమక్క మధ్య లగ్జరీ బడ్జెట్ విషయమై వార్ జోరుగా సాగింది. హర్ట్ అయిన శ్రీముఖి స్మోకింగ్ రూమ్‌కి పరుగు తీసింది. స్మోకింగ్ చేయలేదు కానీ, ఏంటీ.? శ్రీముఖి స్మోకింగ్ చేసేస్తుందా.? అని ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించింది.
కానీ, అక్కడ ఆడియన్స్ ఊహించినట్లు ఏమీ జరగలేదు. అక్కడి నుండి బయటికొచ్చిన శ్రీముఖి ఇది నా ఏరియా కాదు.. కానీ, జస్ట్ బ్రీతింగ్ కోసం వెళ్లానంటూ కవరింగ్ ఇచ్చింది. ఇకపోతే, హేమక్క, రాహుల్ తమ్ముడి ఫుడ్ ఇష్యూ కూడా సద్దు మనగలేదు. నాగార్జున గారి దగ్గర తేల్చుకుందాం. ఒకవేళ నాగార్జునగారు నాది తప్పు అని తేలిస్తే, నేను రాహుల్‌కి సారీ చెప్పడానికి సిద్ధమే. కానీ, తప్పు చేయనప్పుడు నేనెందుకు బ్లేమ్ అవ్వాలని హేమ అభిప్రాయ పడింది. డైనింగ్ టేబుల్ వద్ద రోజుకో రకంగా ఇష్యూ లేస్తోంది.
'ఆర్య' సినిమాలో నా గుడ్డు పోయింది.. అని కాజల్ అన్నట్లుగా, నా హాఫ్ చపాతీ పోయింది.. అంటూ పునర్నవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలీ తిన్నాడేమో అని పొరపాటు పడిన పునర్నవి అలీని నోటికొచ్చినట్లు తిట్టేసింది. కానీ తిన్నది బాబా భాస్కర్ అని తెలిశాక అవాక్కయ్యి కామ్ అయ్యింది. నిజంగానే ఆ ప్లేస్‌లో అలీనే ఉండి ఉంటే, ఇష్యూ పెద్దదే అయ్యేది. బాబా భాస్కర్ కాబట్టి, లైట్ తీసుకుందేమో పునర్నవి. ఇలా లేటెస్ట్ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో వింత యాక్షన్ ఘట్టాలు చోటు చేసుకున్నాయి.