స్టార్ మా నిర్వహిస్తున్న మెగా కాంట్రవర్సీ రియాలిటీ షో 'బిగ్ బాస్' 3వ సీజన్ గత వారం తో విజయవంతంగా 43 రోజులు పూర్తి చేసుకుంది. కింగ్ 'నాగార్జున' ను తాత్కాలికంగా నటి 'రమ్య కృష్ణ' అలియాస్ 'రాజమాత శివగామి'...నా మాటే శాసనం అంటూ సందడి చేసింది. స్పెషల్ హోస్టు తో పాటు ఈ వీకెండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు..అదే నో ఎలిమినేషన్. ఇప్పటి వరకు 6 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో 5 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా కూడా బిగ్ హౌస్ కు బై బై చెప్పింది.
అయితే బిగ్ హౌస్ లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తుండగా ఆ వైల్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ లిస్టులో నటి 'ఇషా రెబ్బ' మరియు 'శ్రద్ధ దాస్' పేర్లు వినిపించాయి కానీ అవి గాలి వార్తలే అని స్పష్టమైపోయింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో ఇంకో పేరు చేరింది. అది మరెవరో కాదు ఒకప్పటి బ్యూటిఫుల్ యాంకర్ 'శిల్ప చక్రవర్తి'. శిల్ప హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు నెట్టింట్లో వార్త వైరల్ అయింది. మరి ఇది ఎంతవరకు నిజమో కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.