సోమవారం సోషల్ మీడియా పవన్ నామ జపంతో ఊగిపోయింది. తన అభిమాన కథానాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్లర్ ఖాతాల్లో చెలరేగిపోయాంతా. #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్‌లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్‌లన్నీ లెక్కేస్తే కోటి దాటేశాయి. పవన్ క్రేజ్‌కి ఇది మరో నిదర్శనం. సినీ రంగం, రాజకీయ నాయకులు, వ్యాపారస్థులు ఇలా ఒక్కరేంటి? అందరూ పవన్‌పై తమ ప్రేమని చాటుకున్నారు. పవన్ సినిమాలేం చేయడం లేదు. రాజకీయంగానూ చాలా ఒడిదుడుకుల్లో ఉన్నాడు.
దానికి తోడు.. రెండు చోట్ల పోటీ చేస్తే - రెండు చోట్లా ఓడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ పుట్టిన రోజు ఇంత గ్రాండ్‌గా జరుపుకోవడం చూస్తుంటే - పవన్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని అర్థం అవుతోంది. పవన్ పుట్టిన రోజు కానుకగా జనసేన పార్టీకి వంద కోట్లు విరాళంగా సేకరించి ఇవ్వాలని పవన్ అభిమానులు భావించారు. ఈ ప్రయత్నం సైతం ఓ యజ్ఞంలా సాగింది. బ్యాంకు రశీదుల్ని తన వాల్స్ లో పోస్ట్ చేస్తూ చాలామంది అభిమానులు పవన్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఆ లెక్క కూడా తేలాల్సివుందిప్పుడు.