బిగ్ బాస్ 2 జరుగుతున్నంతసేపూ అందరికళ్లూ తనీష్ -కౌశల్ పైనే ఉండేవి. 'పిచ్చికుక్కలు' అని ఓ సందర్భంలో కౌశల్ నోరు జారడంతో... వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. కౌశల్ ఆర్మీ.. తనీష్‌ని వీర లెవెల్లో ఆడుకుంది. తనీష్ ఫ్యాన్స్ కూడా కౌశల్‌ని విడిచిపెట్టలేదు. బిగ్ బాస్ అయిపోయాక కూడా వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. మొన్నామధ్యే.. నా జీవితాన్ని తనీష్ నాశనం చేయాలనుకుంటున్నాడు అంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు కౌశల్. ఇలా... ఒకరిపై ఒకరు మండిపడుతూనే ఉన్నారు.
తాజాగా ఇప్పుడు రాజకీయాల్లోనూ వీరిద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారు. కౌశల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ చాలా రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ ఆమధ్య కౌశల్ చంద్రబాబు నాయుడుని కలుసుకున్నాడు. ఇప్పుడు తనీష్ వంతు వచ్చింది. జగన్ ని కలిసి.. అధికారికంగా ఆ పార్టీలో చేరిపోయాడు. జగన్ ని గెలిపించేవరకూ శ్రమిస్తా - అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చాడు. ఆంధ్రా రాజకీయాల్లో టీడీపీ - వైకాపా మధ్య నువ్వా నేనా అన్నట్టు యుద్దం సాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణల అస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇప్పుడు కౌశల్, తనీష్‌లు కూడా తయారయ్యారు. ఈ వైరం ఎంత దూరం వెళ్తుందో మరి..?