టాలీవుడ్ యంగ్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. బాహుబలి తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో మొదట్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా తెలియజేసారు. ఈ ప్రెస్ మీట్ తరువాత ఆర్ఆర్ఆర్ పై ఉన్న అంచనాలు ఇంకా రెట్టింపయ్యాయి.
పాన్ ఇండియా సినిమాగా నిర్మితమవుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా.. క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో హిందీలో కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో.. ఈ సినిమా హిందీ రైట్స్ విషయంలో ఆసక్తి నెలకొంది. బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన ప్రొడ్యూసర్ కరణ్ జోహారే.. ఈ సినిమా రైట్స్ కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది.
అయితే.. ఇప్పుడు కొత్తగా రిలయన్స్ సంస్థ కూడా రంగంలోకి దిగింది. 'ఆర్ఆర్ఆర్' హిందీ రైట్స్ కోసం నిర్మాత దానయ్య కి భారీ నగదు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ.. రాజమౌళి మాత్రం కరణ్ జోహార్ వైపే మొగ్గుచూపుతున్నారట. కరణ్ జోహార్ కి హిందీలో మంచి మార్కెట్ ఉంది. బాహుబలి సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేయటం వల్లే అంత క్రేజ్ వచ్చిందని, కాబట్టి 'ఆర్ఆర్ఆర్' హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా కరణ్ కే ఇవ్వాలని అనుకుంటున్నారట.
చూడాలిమరి.. ఈ భారీ ప్రాజెక్ట్ హిందీ రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటారో..!