కంటిస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!

By iQlikMovies - August 27, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

గత వారం 'అషు రెడ్డి' ఎలిమినేషన్ తో జోరుగా సాగుతుంది బిగ్ బాస్ షో. ఇక తాజా ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకోవడం తో షో మరింత ఆసక్తికరంగా మారింది. బియాండ్ ఫ్రెండ్స్ లా ఒకరి కోసం ఒకరు ఉండే.. రాహుల్, పునర్నవి కి మధ్య మాటల యుద్ధం జరిగి ఇద్దరు హర్ట్ అవ్వడం జరిగింది. ఇక తాజా ప్రోమో ని బట్టి చూస్తే వితిక మొహం మీద కాఫీ పోసినంత పని చేసాడు వరుణ్ సందేశ్.

 

ఇది ఇలా ఉంటే హౌస్ మేట్స్ కు గట్టి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. శివ జ్యోతి మినహా మిగిలిన సభ్యులందరినీ జంటలుగా పార్టనర్స్ ను సెలెక్ట్ చేసుకోమన్నాడు.. దాంతో బాబా భాస్కర్‌-మహేష్‌‌, శ్రీముఖి-హిమజ, రవి-అలీ, వరుణ్- పునర్నవి, రాహుల్-వితికలు జోడీ కట్టారు. వారిలో ఎవరో ఒకరిని మిగతా సభ్యులు ఈ వారం ఎలిమేషన్ కు నామినేట్ చేయమని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

 

ఈ నామినేషన్ లో వరుణ్ సేఫ్ అయినా కానీ.. కెప్టెన్ శివ జ్యోతి కి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ తో డైరెక్ట్ గా వరుణ్ ని నామినేట్ చేసింది. దాంతో ఈ వారం నామినేషన్ లిస్టు లో హిమజ, రాహుల్, మహేష్‌, రవి, వరుణ్ సందేశ్ మరియు పునర్నవి చేరారు. మరి ఈ లిస్ట్ లో ఎవరు ఈవారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS