బిగ్‌బాస్ ఎలిమినేషన్స్‌లో మొదటి నుండీ ఒకే ఫార్ములా కంటిన్యూ అవుతూ వస్తోంది. అదే ఫస్ట్ టైమ్ ఎవరు నామినేట్ అవుతారో వారు ఎలిమినేట్ అవుతున్నారు. లేటెస్ట్ ఎలిమినేషన్ అలీ రెజా విషయంలోనూ అదే జరిగింది. ఫస్ట్ ఎలిమినేషన్ హేమని తీసుకున్నా, రోహిణిని తీసుకున్నా అది కన్‌ఫామ్ అవుతుంది. అలీ రెజా విషయంలో అలా జరగదని భావించారంతా. కానీ, అలీ విషయంలోనూ ఈ ఫార్ములా మిస్ కాలేదు.
ఇక ఈ వారం తృటిలో ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు రవి కృష్ణ. ఒకవేళ రవి కూడా నామినేట్ అయ్యి ఉంటే, ఈ వారం వికెట్ పడేది పక్కాగా రవిదే. కానీ, కెప్టెన్ బాబా భాస్కర్ సమయ స్ఫూర్తితో ఆలోచించి రవికృష్ణని ఎలిమినేషన్ నుండి తప్పించారు. కెప్టెన్‌గా తనకి ఒకరిని సేవ్ చేసే ఛాన్సిచ్చాడు బిగ్‌బాస్. ఆ ఛాన్స్‌ని రవి కోసం యూజ్ చేసి, నామినేషన్ నుండి తప్పించాడు. బాబా భాస్కర్ చేసిన ఈ అనూహ్య చర్యకు శ్రీముఖితో సహా, హౌస్‌లో అందరూ షాకయ్యారు. ఈ విషయమై శ్రీముఖి, హిమజ బిగ్ డిస్కషన్ కూడా పెట్టారు. ఇక ఈ వారం ఫస్ట్‌టైమ్ నామినేషన్స్‌లో అడుగు పెట్టిన కంటెస్టెంట్ శిల్పా చక్రవర్తి.
అంటే ఈ వారమే శిల్పా చక్రవర్తిని హౌస్ నుండి పంపించేస్తారా.? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నా సింహాద్రిని కూడా రెండు వారాల్లోనే బయటికి పంపించేశారు. అలాగే శిల్పని కూడా రెండో వారమే పంపించేస్తారనుకోవాలి. అదీ కాక, శిల్ప, హౌస్‌మేట్స్‌తో కలవలేకపోతోందనే అభిప్రాయం హౌస్‌మేట్స్‌లో ఉంది. తాను హౌస్‌లో ఏక్ నిరంజన్‌గా ఉండిపోవాల్సి వస్తోందనేది ఆమె అభిప్రాయం. సో ఈ వారం హౌస్ నుండి సింపుల్‌గా శిల్పా చక్రవర్తిని బయటికి పంపించేస్తారేమో.