బిగ్‌ ట్విస్ట్‌: వితికా కోసం బాబాని బలి చేసిన అలీ.

మరిన్ని వార్తలు

నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా, కెప్టెన్‌ అయిన ఆలీకి ఓ ఆప్షన్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. నలుగురిని నామినేట్‌ చేసే అవకాశం ఇచ్చాడు మొదట. చివరిగా వారిలో నుండి ఒకరిని మాత్రమే ఎంచుకుని చెప్పాలని చెప్పాడు. అలా వితికా, హిమజ, రాహుల్‌, బాబా భాస్కర్‌.. ఈ నాలుగు పేర్లు బిగ్‌బాస్‌ ముందుంచాడు. ఈ నాలుగింటిలో చివరికి బాబా భాస్కర్‌ని ఫైనల్‌ చేశాడు. ఆల్రెడీ రాహుల్‌, హిమజ నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి, బాబాని నామినేట్‌ చేశానని చెప్పాడు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. అక్కడ ఉన్న మరో ఆప్షన్‌ వితిక.

 

కానీ, వితికని నామినేట్‌ చేయకుండా, బాబాని అలీ నామినేట్‌ చేశాడు. దాంతో ఆయన బాగా హర్టయ్యాడు. అంత త్వరగా తన నామినేషన్‌ని ఆయన డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. నువ్వు నన్నే ఎందుకు నామినేట్‌ చేశావ్‌. మిగిలిన వాళ్లున్నారు కదా.. అని అలీని నిలదీశాడు. అందుకు అలీ చెప్పిన కారణం. వితికాకి మ్యారేజ్‌ యానివర్సరీ గిఫ్ట్‌ ఇచ్చాను అని. పాయింట్‌ రీజన్‌బుల్‌గానే ఉంది. కానీ, కెప్టెన్‌ని ఇంప్రెస్‌ చేయగలిగితే, నామినేషన్‌ నుండి తప్పించుకోవచ్చని బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆప్షన్‌ని బాబా భాస్కర్‌ బాగా యూజ్‌ చేసుకున్నారు. అలీని ఇంప్రెస్‌ చేసేందుకు కాళ్లా వేళ్లా పడ్డాడు.

 

అయినా కానీ, అలీ తననే నామినేట్‌ చేయడంతో ఆయన కొంచెం హర్టయిన మాట వాస్తవమే. ఆ క్రమంలో నేనేమైనా హౌస్‌లో జోకర్‌నా.? అంటూ కొన్ని బలమైన మాటలు ఆయన నోటి వెంట వచ్చేశాయి కూడా. ఆ తర్వాత మళ్లీ అంతా కలిసిపోయారు. సరదా సరదాగా ఎంటర్‌టైన్‌ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో శివజ్యోతి, శ్రీముఖి కలిసి వితిక, పునర్నవిలను ర్యాగింగ్‌ చేశారు. అలా హౌస్‌లో తాజా ఎపిసోడ్‌ ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్స్‌తో సరదాగా సాగిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS