పవన్‌ కళ్యాణ్‌పై 'బిగ్‌' ఆశలు పెట్టుకున్న అషు రెడ్డి.

మరిన్ని వార్తలు

బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ మండా, పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని. అప్పట్లో పవన్‌ అభిమానులు కౌశల్‌ని కొంత మేర సమర్థించారు. కౌశల్‌ విజయంలో పవన్‌ అభిమానుల వాటా పెద్దదే. ఇప్పుడు తాజాగా బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ అషు రెడ్డి కూడా అదే పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల మద్దతుతో విజయం సాధించాలని అనుకుంటున్నట్టుంది. అషు రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ పట్ల తనకున్న అమితమైన అభిమానాన్ని గతంలోనే చాటుకుంది. జనసేన ఆవిర్భవించాక కూడా పవన్‌ కళ్యాణ్‌ని కలిసింది, జనసేనకు తన మద్దతు ప్రకటించింది.

 

ఆ ఫొటోల్ని ఇప్పుడు అషు రెడ్డి బ్యాక్‌ ఎండ్‌ టీమ్‌, సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేస్తున్నాయి. మరోపక్క, పవన్‌ కళ్యాణ్‌ పేరుని టాట్టూగా తన శరీరంపై వేయించుకున్న అషు రెడ్డికి సంబంధించిన ఫొటోలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. అయితే, ఏం చేసినా బిగ్‌ హౌస్‌లో అషు రెడ్డి యాక్టివ్‌ కంటెస్టెంట్‌ అన్న అభిప్రాయం అయితే జనంలో కలగడంలేదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అషు రెడ్డి, బిగ్‌ హౌస్‌లో వీకెస్ట్‌ కంటెస్టెంట్‌గా చెప్పొచ్చు.

 

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయిన అషు రెడ్డి, బిగ్‌ హౌస్‌లో ఎందుకింత డల్‌గా మారిపోయిందో ఆమె అభిమానులకే అర్థం కావడంలేదు. అయితే, అషు ఖచ్చితమైన వ్యూహాలతో వుందనీ, టైమ్‌ చూసి జూలు విదిలిస్తుందనీ ఆమె అభిమానులు అంటున్నారు. నిజంగానే ఆ స్థాయిలో ఆమె 'పవర్‌' చూపించగలిగితే, పవర్‌ స్టార్‌ అభిమానుల సపోర్ట్‌ కూడా ఆమెకు తోడయ్యే అవకాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS