బిగ్‌బాస్‌లో గతవారమంతా కౌషల్‌ని టార్గెట్ చేస్తూ, హౌస్‌లోని కొందరు చేసిన కుతంత్రాలతో హౌస్ వాతావరణం బాగా వేడెక్కింది. కౌషల్‌పై జరిగిన కుట్రలు, కుతంత్రాలు వీక్షకులంతా చూశారు. అయితే వారాంతానికొచ్చేసరికి నాని రాకతో హౌస్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
కౌషల్‌ని మాత్రమే తప్పు పడుతూ బాబు గోగినేని, తనీష్, సామ్రాట్లే కాక, గీతా మాధురి, దీప్తిలతో సహా చేసిన కామెంట్స్‌కి నాని కౌంట్ ఎటాక్ ఇచ్చేశాడు. తప్పును తప్పు అని చెప్పేందుకు మీరెవరు? అది తేల్చాల్సింది ప్రేక్షకులు అని వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కామ్ అప్ అయిపోయారు.
ఆ తర్వాత కౌషల్ కూడా హౌస్ మేట్స్ అందరినీ ఒక్కొక్కరిగా కలిసి పర్సనల్‌గా సారీ చెప్పడంతో ప్రస్తుతానికి అంతా కౌషల్‌ని క్షమించేసినట్లుగా కనిపించారు. ఏకంగా తనీష్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంతవరకూ కౌషల్‌పై విపరీతమైన నెగిటివిటీతో ఉన్న తనీష్‌కి కౌషల్ సారీ చెప్పడంతో హగ్గిచ్చి, బిగ్ బ్రదర్ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
కానీ కౌషల్‌కి ఇదేం కొత్త కాదు. ముఖం ఎదుట సరే అని, వెనక తనపై గూడు పుటానీలు జరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా ఇప్పటికైతే హౌస్‌లో వాతావరణం చల్లారినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి అసలు ట్విస్ట్ ఎలా ఉండబోతోందో. ఈ రోజు తెలుస్తుంది.
ఇకపోతే ఈ వారం బిగ్‌హౌస్ నుండి ఎలిమినేషన్స్ ఏమీ జరగకపోవడం కొసమెరుపు.