హేమ యాక్టింగ్‌లోనే బోలెడంత ఓవరాక్షన్. ఇక ఇక్కడ రియాల్టీ షో. ఇంకెంత చేస్తుంది చెప్పండి. అదే చేస్తోంది. తొలిరోజు బిగ్‌బాస్ హౌస్‌లో హేమ ఆటిట్యూడ్‌ని పరిశీలిస్తే, రెండు సార్లు ఆమెను కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిపించారు బిగ్‌బాస్. కన్‌ఫెషన్ రూంలో హేమ ఒకింత ఎక్కువ టెన్షన్ ఫీలైనట్లుగా కనిపించింది. బిగ్‌బాస్ సూచన మేరకు హౌస్ మేట్స్ నుండి ఒకరిని మానిటర్‌గా ఎంచుకోమంటే, ఆ మానిటర్ బాధ్యతలు హేమకే దక్కాయి.
అయితే, ఈ మానిటర్ తనకు చిక్కులు తెచ్చిపెట్టిందనీ, ఒకరిని సపోర్ట్ చేస్తే, మిగిలిన వారికి ఎనిమి అవుతానని ఆమె భయపడ్డారు. కానీ, గేమ్‌లో తప్పవు కదా. అందుకే తన బాధ్యతను తాను జెన్యూన్‌గా నిర్వర్తిస్తానంటూ బిగ్‌బాస్‌కి తెలిపారు. బిగ్‌బాస్ వాయిస్‌కి హేమలోని భయాన్ని కనిపెట్టిన బాబా భాస్కర్ ఆమెను తరచూ బిగ్‌బాస్ వాయిస్‌తో భయపెడుతూ ఆట పట్టించడం ఆట్టుకుంటోంది. ఇక సావిత్రక్క అలియాస్ శివ జ్యోతి గురించి చెప్పాలంటే, బిగ్‌బాస్‌కి 'కన్నింగ్' అనాల్సి వస్తుందేమో. అప్పుడే ఆమె గూడుపుటానీ మొదలెట్టేసింది.
హిమజ, ఆషురెడ్డితో కలిసి సావిత్రక్క చేస్తున్న గూడుపుటానీ ఆమెను కన్నింగ్ అని తేల్చేశారు ఆడియన్స్. సోషల్ మీడియాలో సావిత్రక్కపై ఈ రకమైన ట్రోలింగే రన్ అవుతోంది. మానిటర్‌గా హేమని ఎంచుకోవడం పట్ల ఆమె వైఖరిని బట్టి కూడా ఇలా అర్ధం చేసుకొని ఉండొచ్చు ఆడియన్స్. ఏది ఏమైనా తొలిరోజే పక్కాగా ఐడియాకి వచ్చేయలేం కానీ, డే 1 నుండే హౌస్‌లోని అందరి మీదా ఓ కన్నేసి ఉంచమని నాగ్ చెప్పారు కాబట్టి ఈ విశ్లేషణ. అంతేనండీ బాబూ. అఫ్‌కోర్స్ ఎవరి విశ్లేషణ వారు చేసుకోవచ్చుగా. బిగ్‌బాస్ మనందరిదీ.