ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెరపై బిగ్‌బాస్ మొదటి సీజన్ అప్పటివరకూ ఉన్న టీఆర్‌పీ రేటింగ్స్‌నన్నిటినీ తుడిచిపెట్టేసింది. కానీ బిగ్‌బాస్ సీజన్ 2 మాత్రం ఇంకా ఆ టాక్‌ని సొంతం చేసుకోవడంలో ఇంకా చాలా వెనకబడే ఉంది. షో స్టార్ట్ అయ్యి నెల రోజులు పైబడుతున్నా, రేస్‌లో వెనకబడే ఉంది బిగ్‌బాస్ 2.
నాని హోస్ట్‌గా తొలి వారం ఓకే అనిపించినా, రెండు, మూడు వారాల్లో పుంజుకున్న నానిని చూసి, అంచనాలను అందుకుంటాడనిపించింది. కానీ కిరీటి ఎలిమినేషన్‌లో నాని వ్యవహరించిన తీరుకు హోస్టింగ్ పరంగా నాని నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. అయితే బిగ్‌బాస్ షోలో మనం ఊహించిందేమీ జరగడం లేదు. ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అదే కదా వారి ట్యాగ్ లైన్. ఏమైనా జరగొచ్చు అని. అందుకే ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.
ఇది ఒప్పుకుని తీరాల్సిందే. అలాగే ఎంట్రీలు కూడా టాక్‌కి భిన్నంగా జరుగుతున్నాయి. నిజానిక ఇంతవరకూ హౌస్ నుండి బయటికి వచ్చినవారే తప్ప వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చిన వారు లేరు. రెండో వారం ఎంటర్ అయిన నందిని తప్ప. గత కొంత కాలంగా బిగ్ హౌస్‌లోకి హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంట్రీ ఇస్తుందంటూ టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే అది కూడా ఫేక్ టాక్‌గానే మిగిలిపోయింది. ఎందుకంటే హౌస్‌లోకి ఎవ్వరూ ఊహించని విధంగా ఓ కంటెస్టెంట్ ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసింది.
ఆమె ఎవరో కాదు, 'సామిరారా' సినిమాతో అందరికీ సుపరిచితురాలైన పూజా రామచంద్రన్. పలు తెలుగు చిత్రాలతో పాటు, మలయాల చిత్రాల్లోనూ నటించింది పూజా రామచంద్రన్. గ్లామర్‌లో కూడా పెద్దగా పట్టింపులు లేవు ఈ బ్యూటీకి. సో ఈమె ఎంట్రీ బిగ్‌బాస్ షోకి ఎలాంటి గ్లామర్ తెచ్చిపెడుతుందో చూడాలిక.