అమరవీరుల కుటుంబాలకు బిగ్ బాస్ విజేత కౌశల్ చేయూత..!

By Thejaswini Allam - February 20, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో ఈ నెల 14 న జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దాడిలో 40 కి పైగా  సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు. ఈ వీర సైనికుల కుటుంబాలకు చేయూతను అందించటానికి పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమదైన శైలిలో ముందడుగు వేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే, తాజాగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మంద వీరజవాన్ల కుటుంబాలకు విరాళం ప్రకటించడం జరిగింది. తన అభిమాన సంఘం కౌశల్ ఆర్మీతో చేతులు కలిసి విరాళాల కోసం ర్యాలీలు నిర్వహించి 50 వేల రూపాయలు సేకరించారు. ఆ మొత్తాన్ని సీఆర్‌పీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు ఇస్తున్నట్లు తాజాగా తన సామజిక మాధ్యమం ద్వారా తెలియజేసారు.

 

ఇంతకుముందే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు తమకు తోచిన విధంగా ఆర్ధిక సహాయం అందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS