నితిన్ సినిమాకి ఇంట్ర‌స్ట్రింగ్ టైటిల్‌

By Gowthami - March 30, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

నితిన్ జోరుమీద ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. 'భీష్మ‌' త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితోనూ ఓ సినిమా ఉంది. ఇప్పుడు మ‌రో సినిమా విశేషాలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబోలో ఛ‌ల్ మోహ‌న రంగ వ‌చ్చింది. ఇది రెండో సినిమా. అయితే  ఈసారి ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోంద‌ట‌. 'ఎన్టీఆర్‌' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి కూడా రెండు భాగాల క‌థే.

 

ఈసారి యంగ్ హీరో నితిన్ మూడు పార్టుల సినిమా తీస్తాడ‌న్న‌మాట‌. తెలుగులో ఇలా ఓ సినిమాని మూడు భాగాలుగా రూపొందించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి 'ప‌వ‌ర్ పేట‌' అనే ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. శ్రేష్ట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతోంది. 'ఛ‌ల్ మోహ‌న రంగ‌' ఫ్లాప్ అయినా. ఆ ద‌ర్శ‌కుడికి మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం, అదీ సొంత నిర్మాణ సంస్థ‌లో తెర‌కెక్కించ‌డం, అన్నింటికంటే మూడు భాగాలుగా ఓ సినిమా రావ‌డం.. నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS