ఈ మధ్య నయనతారను దుర్భాషలు ఆడారంటూ తమిళ నటుడు రాధారవిపై కోలీవుడ్ వర్గాలు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు తమిళ నటులు నయన్‌ని సపోర్ట్ చేస్తూ రాధారవి మాటల్ని తప్పు పట్టారు. అందులో భాగంగా హీరో విశాల్ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యారు.
'రాధారవి' అనే మీ పేరులోని రాధా తీసేయండి. మహిళల్ని గౌరవించడం తెలియని మీకు పేరులో రాధా అనే మహిళ పేరు ఎందుకు.? అని ప్రశ్నించాడు. ఆ మాటకు రాధా రవి స్పందించారు. 'విశాల్‌కి బుద్ధి లేదు.. నా పేరులో ఉన్న 'రాధా' అనే పదం మహిళకు సంబంధించింది కాదు. అది మా నాన్న పేరు. అయినా ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడం కూడా చేతకాని విశాల్ నన్ను విమర్శించడం హాస్యాస్పదం. ఆయన లిమిట్స్‌లో ఆయన ఉంటే బాగుంటుంది.
అయినా నయనతార విషయంలో నేను చెడుగా మాట్లాడింది లేదు. అందరూ అలా అర్ధం చేసుకున్నారంతే. నా మాటల్లోని అర్ధాన్ని పెడ దారి పట్టించేలా అర్ధం చేసుకున్న మీది తప్పు.. నాది కాదు..' అంటూ రాధారవి విశాల్ పేరు చెప్పి, అందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే, తనపై వచ్చిన ఆరోపణలకు రాధారవి ఆల్రెడీ నయనతారకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఆయనపై ఇలాంటి విమర్శలు ఇక తగవనే చెప్పాలి.